- Advertisement -
నవతెలంగాణ-చిన్నకోడూరు
మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈసందర్బంగా హరీష్ రావు ను కలిసి, పరామర్శించి, మృతుడు సత్యనారాయణ రావుకు పువ్వులు వేసి శ్రద్ధాంజలి ఘటించిన చిన్నకోడూరు మండల మెట్ పల్లి గ్రామ నాయకులు, హరీష్ రావు తండ్రి కి ఆత్మ చేకూరాలని ఆ భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉమేష్ చంద్ర, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, మండల వైస్ ఎంపీపీ కిసరి పాపయ్య, బొస్స ప్రభాకర్, మాజీ సర్పంచ్ శంకరయ్య, చిన్నకోడూరు గ్రామ మాల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



