- Advertisement -
న్యూఢిల్లీ : అశోక్ లేలాండ్ మాతృసంస్థ హిందుజా గ్రూప్ చైర్మెన్ గోపీచంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. లండన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హిందుజా కుటుంబంలో రెండో తరానికి చెందిన గోపీచంద్ 2023లో గ్రూప్ సంస్థలకు చైర్మెన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సోదరుడు శ్రీచంద్ మరణానంతరం ఆ బాధ్యతలు స్వీకరించారు. గోపీచంద్ హిందుజాకు భార్య సునీత, కుమారులు సంజరు, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచే వ్యాపార రంగంలో ఉన్న హిందుజా గ్రూప్‌లోకి 1959లో గోపీచంద్ చేరారు.
- Advertisement -



