Wednesday, November 5, 2025
E-PAPER
Homeబీజినెస్బజాజ్‌ ఫైనాన్స్‌ రుణాల్లో 27 శాతం వృద్ధి

బజాజ్‌ ఫైనాన్స్‌ రుణాల్లో 27 శాతం వృద్ధి

- Advertisement -

హైదరాబాద్‌ : దేశంల్ణో అతిపెద్ద బ్యాంకింగేతర విత్త సంస్థ బజాజ్‌ ఫిన్‌సర్వ్‌లో భాగమైన బజాజ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ ఇటీవల పండుగ సీజన్‌లో భారీగా రుణాలను జారీ చేసినట్లు తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పరిమాణంలో 27 శాతం, విలువలో 29 శాతం ఎక్కువ రుణాలు అందించినట్లు వెల్లడించింది. జిఎస్‌టి శ్లాబుల్లో తగ్గుదల కూడా ఇందుకు కలిసి వచ్చిందని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 22 నుంచి అక్టోబర్‌ 26 మధ్య సుమారు 63 లక్షల రుణాలను పంపిణీ చేసింది. ఈ కాలంలో 23 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించుకున్నట్టు తెలిపింది. అందులో 52 శాతం మంది రుణాలు పొందారని బజాజ్‌ ఫైనాన్స్‌ చైర్మెన్‌ సంజీవ్‌ బజాజ్‌ వెల్లడించారు. లక్షలాది తక్కువ ఆదాయ కుటుంబాలను పండుగ సీజన్‌లో నమ్మకంగా ఖర్చు చేయడానికి సాధికారత కల్పించామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -