జీసీసీ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్లోబల్ కమాండ్ సెంటర్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం రాయదుర్గంలో అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్ సంస్థ డాయిష్ బోర్స్ గ్రూప్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ)ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచంలోని టాప్ టెన్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల్లో ఏడు ఇక్కడే నిర్వహిస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని కేవలం ఇంక్యుబేషన్ హబ్‌గా మాత్రమే కాకుండా ‘గ్లోబల్ ఆవిష్కరణ పవర్‌హౌస్’గా మార్చేలా ప్రత్యేక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించబోతున్నామని వివరించారు.
ఈ నూతన హబ్ రీసెర్చ్, బ్రేక్‌త్రూ ఐడియాలకు ప్లాట్‌ఫామ్‌గా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం పెట్టుబడులను ఆకర్షించడంమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇచ్చే సంపదను సృష్టించేందుకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్, స్పెషల్ సీఎస్ సంజరు కుమార్, డ్యుయిష్ బోర్స్ సీఐవో/ సీవోవో డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, డైరెక్టర్ డాక్టర్ లుడ్విగ్ హీన్సెల్‌మన్ తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ కమాండ్ సెంటర్‌గా హైదరాబాద్
- Advertisement -
- Advertisement -



