- Advertisement -
నవతెలంగాణ జన్నారం
కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం అటవీ డివిజన్ ఇందన్ పల్లి రేంజ్ పరిధిలోని మురిమడుగు బీట్ అడవులలో నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ, లక్ష్మీనారాయణ ఎఫ్ఎస్ఓ రవి తెలిపారు. పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను ఇంధన్ పల్లి రేంజ్ కు తరలించామన్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని అడవులలో నుంచి అక్రమంగా ఇసుక తరలించిన, కలప తలలించిన, వన్య మృగాలను వేటాడిన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మురి మడుగు ఎఫ్బి ఓ రాజేశ్వర్ బేస్ క్యాంపస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



