– ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ
నవతెలంగాణ – ఊరుకొండ
గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా వచ్చే మెసేజ్ లు ఓపెన్ చేసి సైబర్ నేరాలకు గురి కావద్దని.. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఊరుకొండ ఎస్సై కృష్ణదేవ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన సైబర్ నిరాలపై అవగాహన కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ లో వివిధ లింకుల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు పంపించి మెసేజ్ లు ఓపెన్ చేయరాదని.. వ్యక్తిగత బ్యాంకు వివరాలు ఇతరులకు తెలపకూడదని.. లోన్లు ఇస్తామని ఆశపెట్టే సైబర్ నేరగాళ్లకు ఓటీపీలు, వ్యక్తిగత వివరాలు ఇతరులకు చెప్పకూడదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వివిధ ప్రాంతాల ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



