Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తాం… ఎంవిఐ రాహుల్ కుమార్

నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తాం… ఎంవిఐ రాహుల్ కుమార్

- Advertisement -

నవతెలంగాణ-ఆర్మూర్: రవాణా శాఖ కమిషనర్, జిల్లా సీపీ ఆదేశానుసారం నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని పట్టణ ఎంవీఐ రాహుల్ కుమార్ బుధవారం తెలిపారు. ఇటీవల మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వ‌ద్ద‌ వాహనాల తనిఖీ విస్తృతం చేశారు. టాక్స్ కట్టని, ఫిట్‌నెస్‌ లేని ఆరు వాహనాలను సీజ్ చేసిన‌ట్లు తెలిపారు. ఒక పాఠశాల బస్సు, 5 ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నాయ‌న్నారు. పట్టణ రవాణా శాఖ పరిధిలో కాలం చెల్లిన వాహనాలు ఉన్నాయని అన్నారు. వాహనాల పత్రాలు సరిగా ఉంటేనే రోడ్లపైకి తీయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు .కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు అవుతున్న, కాలం చెల్లిన వాహనాలు కూడా ఎక్కువగా ఉన్నాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -