Wednesday, November 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్‌కె హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం

ఆర్‌కె హాస్పిటల్‌లో ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టర్: భువనగిరి జిల్లా కేంద్రంలోని ఆర్‌కె హాస్పిటల్‌లో స్టార్ హాస్పిటల్ హైదరాబాద్, చావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో పల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 126వ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ పెద్ది శ్రీకాంత్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణ, పరిసర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్, పి ఎఫ్ టి పరీక్షలు నిర్వహించి, పర్మనాలజిస్ట్ వైద్యులసే వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు శ్రీ ఆర్కే హాస్పిటల్ అధినేత డాక్టర్ చావా రాజ్ కుమార్, పల్మనాలజిస్ట్ డాక్టర్ పెద్ది శ్రీకాంత్, డాక్టర్ చావా అసలేష, స్టార్ హాస్పిటల్ మార్కెటింగ్ డీజీఎం వినోద్, శ్రీ ఆర్‌కె హాస్పిటల్ ఇంచార్జ్ కొండల్ రెడ్డి, స్టార్ మార్కెటింగ్ మేనేజర్ స‌తీష్‌లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -