- సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ: గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనలలో గ్రామపంచాయతీ కార్మికులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వారితో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వారికి కనీస సౌకర్యాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. శ్రమకు తగ్గ వేతనాలు అందించాలని కోరారు. కార్మికుల హక్కుల కోసం బలమైన ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
కార్మికుల హక్కులను కాలరా సేందుకు పాలకులు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి రోజంతా కార్మికులతో పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. ఎనిమిది గంటల పని విధానాలు అమలు చేయాలనన్నారు. కార్మికులకు పీఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలని, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఐక్యంగా ఉండి ఉద్యమాలతో సంఘాన్ని బలోపేతం చేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డా.మల్లు గౌతమ్ రెడ్డి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు జిల్లా సైదులు,మంద అనుకు, బుచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి దుర్గయ్య, నిమ్మలకోటి సైదులు,రవి, కోటయ్య, శ్రీను, మంద ఏసు, సైదులు,శివ, వీరయ్య, వెంకయ్య, శోభన్ తదితరులు పాల్గొన్నారు



