Thursday, November 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంమినిట్‌మ్యాన్‌ క్షిపణి ప్రయోగం

మినిట్‌మ్యాన్‌ క్షిపణి ప్రయోగం

- Advertisement -

అమెరికా వైమానిక దళానికి
చెందిన గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ పరీక్ష
కాలిఫోర్నియా:
అమెరికా వైమానిక దళానికి చెందిన గ్లోబల్‌ స్ట్రైక్‌ కమాండ్‌ కాలిఫోర్నియా నుంచి నిరాయుధ మినిట్‌మ్యాన్‌ 3ను ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి (ఐసీబీఎం)ను పరీక్షించింది. ఇది ఒక సాధారణ పరీక్ష. ఆ క్షిపణి మార్షల్‌ దీవులకు సమీపంలోని రోనాల్డ్‌ రీగన్‌ బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ పరీక్షా స్థలంలో పడింది. అధ్యక్షుడు ట్రంప్‌ అణ్వాయుధాలపై చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరీక్ష నిర్వహించటం గమనార్హం.మినిట్‌మ్యాన్‌ 3 క్షిపణి పాతదే కాని శక్తివంతమైనదని అధికారులు ధ్రువీకరించారు. ఇది 1970ల నుంచి వాడుకలో ఉంది. ఇది 13వేల కిలోమీటర్ల పరిధి వరకూ గురిపెట్టవచ్చు. దీంతోపాటు అణు వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్నదని తెలిపారు.అమెరికా వద్ద దాదాపు 400 ఇలాంటి క్షిపణులు ఉన్నాయి, ”మినిట్‌మ్యాన్‌” అని ఎందుకు పిలుస్తారంటే.. ఇది ఒక్క నిమిషంలో సిద్ధంగా ఉంటుంది. 2030 నాటికి దీన్ని కొత్త క్షిపణితో భర్తీ చేయాలని అమెరికా యోచిస్తోంది, కానీ అప్పటి వరకు, ఈ పరీక్షలు కొనసాగుతాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -