– నౌకరీ జాబ్‌స్పీక్ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగ నియామకాలు (వైట్‌కాలర్) క్షీణించాయని నౌకరీ డాట్‌కామ్ జాబ్‌స్పీక్ ఇండెక్స్ రిపోర్ట్ వెల్లడించాయి. గడిచిన నెలలో 9 శాతం పడిపోయాయని తెలిపింది. గతేడాది ఇదే నెలతో పోల్చితే దసరా, దీపావళి పండుగ సెలవులు నియామక ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొంది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు, రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల శోధన ఫలితాల ఆధారంగా ప్రతి నెలా ఈ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. గడిచిన నెలలో మొత్తం నియామక కార్యకలాపాలు స్తంభించినట్టు వెల్లడించింది. రిక్రూటర్లు పోస్ట్ చేసిన కొత్త ఉద్యోగ ప్రకటనలు, రెజ్యూమ్ డేటాబేస్‌లో ఉద్యోగ సెర్చ్‌ల ఆధారంగా జాబ్ మార్కెట్ ట్రెండ్‌లను నౌకరీడాట్‌కమ్ రూపొందిస్తుంది. అకౌంటింగ్, ఫైనాన్స్‌లో 15 శాతం, విద్యా రంగం 13 శాతం, బిపిఒ రంగంలో 6 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. మరోవైపు అత్యధికంగా ఉపాధి కల్పించే ఐటి రంగంలో 15 శాతం, బ్యాంకింగ్‌లో 24 శాతం చొప్పున నియామకాలు భారీగా పడిపోయాయి.
వైట్‌కాలర్ ఉద్యోగ నియామకాల్లో 9 శాతం పతనం
- Advertisement -
- Advertisement -



