వాషింగ్టన్ : భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చాలా సానుకూలంగా ఉన్నారని, వాటిని బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నారని అధ్యక్ష భవనం పత్రికా కార్యదర్శి కరోలిన్ లీవిట్ తెలిపారు. ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఓవల్ కార్యాలయంలో దీపావళి వేడుక జరుపుకుంటూ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారని, ఈ వేడుకలో భారతీయ-అమెరికన్ సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు.
‘ప్రధాని మోడీ అంటే అధ్యక్షుడికి ఎంతో గౌరవం. వారిద్దరూ తరచూ మాట్లాడుకుంటారు. వాణిజ్యంపై రెండు దేశాలు చర్చలు కొనసాగిస్తున్నాయి’ అని చెప్పారు. భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న సెర్గియో గార్‌ను లీవిట్ ప్రశంసలతో ముంచెత్తారు. న్యూఢిల్లీలో ఆయన వాషింగ్టన్‌కు గొప్ప ప్రతినిధి అని కితాబు ఇచ్చారు. గత నెలలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్ దీపావళి వేడుకలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారిగా పనిచేస్తున్న వినయ్ క్వత్రా, ఇండియన్-అమెరికన్ వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ట్రంప్ ఫోన్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
భారత్-అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలం : శ్వేతసౌధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



