: కలెక్టర్ బి.ఎం.సంతోష్
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకున్నారు. నేటి నుంచి యధావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సూచించారు.
అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్ కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర (MSP) చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని ఆన్నారు. మద్దతు ధరలకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని పత్తి కొనుగోళ్లు సీసీఐ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని ఆయన అన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీసీఐ అధికారులు మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం (Moisture Content) పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల సక్రమంగా వ్యవహరించాలని సూచించారు.



