Thursday, November 6, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ తొలి విడ‌త పోలింగ్‌పై ఈసీ స‌మీక్ష‌

బీహార్ తొలి విడ‌త పోలింగ్‌పై ఈసీ స‌మీక్ష‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ తొలి విడ‌త పోలింగ్ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఓట‌ర్లు క్యూలైన్‌లో నిల‌బ‌డి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల‌కు రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. తొలి ద‌శ‌లో 121 స్థానాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. మిగిలిన నియోజ‌క‌వ‌ర్గాల‌కు 11న పోలింగ్ నిర్వ‌హించనున్నారు. పోలింగ్ సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్బందీగా బందోబ‌స్తు క‌ల్పించింది ఆ రాష్ట్ర పోలిస్‌శాఖ‌. తాజాగా ఆ రాష్ట్ర పోలింగ్ ప్ర‌క్రియ‌ను కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌రిశీలిస్తోంది. ఈమేర‌కు ఈసీ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్, మ‌రో ఇద్దరు క‌మిష‌న‌ర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోష్‌ ల‌తో క‌లిసి ఢిల్లీలోని ఎన్నిక‌ల భ‌వ‌న్‌లో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు.

మొదటి దశ ఎన్నికల్లో భాగంగా గ్రామీణ పీఎస్ లతో సహా మొత్తం 45,341 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొదటి దశ ఎన్నికలు ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, ఉద‌యం 9గంట‌ల‌కు వ‌ర‌కు 13.13 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -