నవతెలంగాణ-హైదరాబాద్: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) కస్టడీలో ఉన్న 35ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. దొంగతనం ఆరోపణలతో కింకి గ్రామానికి చెందిన సంజయ్ సోంకర్‌ను ఆర్‌పిఎఫ్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో సంజయ్ పరిస్థితి విషమంగా మారిందని, దీంతో అతనిని గొండా మెడికల్ కాలేజీకి తరలించామని ఆర్‌పిఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ మహేంద్ర ప్రసాద్ దూబే తెలిపారు. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని అన్నారు.
అయితే విచారణ పేరుతో సంజయ్‌ను తీవ్రంగా హింసించారని, తీవ్రంగా కొట్టారని, విద్యుత్‌షాక్ కూడా ఇచ్చారని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. చనిపోయినట్లు అధికారులు తమకు సమాచారం కూడా ఇవ్వలేదని, మృతదేహాన్ని మార్చురీలో వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్ సోదరుని ఫిర్యాదు మేరకు ఇద్దరు ఆర్‌పిఎఫ్ ఎస్‌ఐలు, ఒక కానిస్టేబుల్, ఇతరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు.



