Thursday, November 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ పోలీసుల మానవీయ కోణం..

జుక్కల్ పోలీసుల మానవీయ కోణం..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ చౌరస్తా నుండి ఖండేబల్లూర్ వరకు ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డు అద్వానంగా తయారైంది. వాహనదారులకు ఈ గుంతలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రమాదాలు జరిగి కొంతమంది చిన్న చన్న గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో స్పందించిన ఎస్సై, సిబ్బందితో బాలాజీ నగర్ వద్ద ఏర్పడిన పెద్ద గుంతలను మట్టి వేయించి, రోడ్డును సాధారణ స్థితికి తీసుకోచ్చే ప్రయత్నం చేశారు. వెంటనే స్పందించిన స్థానికులు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా భాద్యతలు తీసుకున్న ప్రస్తుత ఎస్సై అప్పట్లో మండలంలోని కట్టాలి ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్కులు , స్కూల్ బ్యాగులు పలకలు , పెన్నులు, టై, బెల్టులు సామాగ్రిని విరాళంగా అందించారు. సామాజిక కార్యక్రమాలతో పాటు గ్రామాలలో చెడు వ్యసనాలకు యువత అలవాటు పడకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి అవగాహన చేస్తూ తన నైజం ప్రదర్శించారు. పేకాట గుట్కా మట్కా అలవాటు పడిన వారిని ఉపేక్షించకుండా చట్టరీత్యా వారిపై చర్యలు చేపట్టారు. గతంలో మండలంలోని గ్రామాలలో నిర్మానుష్య ప్రదేశాలలో పంట చెళ్లలో ఎక్కడ చూసినా పేకాట ఆడేవారు. ప్రస్తుతము కొంతవరకు సద్దుమణిగిపోయింది. ఇలా మండలంలో ప్రతి విభాగాలపైన ఎస్సై పోలీస్ సిబ్బంది,  గ్రామీణ ప్రజలకు దగ్గరవుతూ వారి ఆదరాభిమానాలు పొందుతున్నారు. బిచ్కుంద సీఐ రవికుమార్ ఎప్పటికప్పుడు సర్కిల్ పరిధిలోని ఎస్సైలకు సలహాలు, సూచనలు చేస్తూ తనవంతుగా కృషి చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -