నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
తల్లి బిడ్డలు క్షేమంగా ఉండేందుకు గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని డాక్టర్ ఏంజెల్ తెలిపారు. గురువారం ఉప్పెరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు, భీంపురం ఆరోగ్య ఉప కేంద్రం, ఉప్పెరు ఉపకేంద్రం పరిధిలోని గ్రామాలలోని గర్భిణీ స్త్రీలను డాక్టర్ ఏంజెల్ పరీక్షించారు. గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా సరైన పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధుల గురించి గర్భిణి స్త్రీలకు అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణీ స్త్రీ, ప్రభుత్వ ఆసుపత్రిలోన కాన్పులు చేసుకోవాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా అత్యవసర పరిస్థితిలో 102, 108 వాహనాలను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయభాస్కర్, నర్సమ్మ, అరుణోదయ, హేమావతి , ఆశాలు పాల్గొన్నారు.
గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలి: డా. ఏంజెల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



