- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ఇటీవల గ్రూప్-1 నియామకాల ద్వారా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగానికి ఎంపికై మంచిర్యాల జిల్లా కేటాయించబడి విధుల్లో చేరిన జిల్లా డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) విలాయత్ అలీ ని జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు మేకల అక్షయ్ కుమార్ గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ ని కలిసిన వారిలో చింతగూడ గ్రామ వాసి కుంద నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు.
- Advertisement -



