నవతెలంగాణ – నకిరేకల్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో నకిరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తమ అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే వీరేశం జూబ్లీహిల్స్ పరిధిలోని రహమత్ నగర్, ఇందిరా నగర్ లోని పేజ్ 1,2 బూత్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించి అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బోరబండ డివిజన్ లోని వినాయక నగర్ 314, 315, 316 బూత్ లలో ఇంటింటి ప్రచారం చేస్తూ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రచారం జరుగుతుంది. పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి ప్రజలను మోసం చేస్తుందని ఓటర్లకు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.




