- Advertisement -
నవతెలంగాణ – వనపర్తి
ఈనెల 15వ తేదీన నిర్వహించబోయే స్పెషల్ లోక్ అదాలత్ పై కక్షిదారులకు, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రజా పరిసరాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార వ్యాప్తి కోసం స్పెషల్ లోక్ అదాలత్ గోడ పత్రికలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బాలయ్య లు గురువారం విడుదల చేశారు. లోక్ అదలతపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలని, పరస్పర అవగాహనతో కేసులను రాజీకుదురుచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పారా లీగల్ వాలంటీర్ బాలరాజు పాల్గొన్నారు.
- Advertisement -



