Friday, November 7, 2025
E-PAPER
Homeజిల్లాలుగురువారం గ్రీవెన్స్ కు వినతుల వెలువ…

గురువారం గ్రీవెన్స్ కు వినతుల వెలువ…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కి దరఖాస్తులు వెలువత్తాయి. జిల్లా కలెక్టర్ మధ్యాహ్నం నుండి సాయంత్రం ఏడు గంటల వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిశీలించినట్లు తెలిపారు.

గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రత్యేక గ్రీవెన్స్ కి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే దీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను పరిశీలించారు.

బీబీనగర్ మండల కేంద్రంలోని ఎంప్లాయిస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయబోయే వైన్స్ షాప్ వల్ల కాలనీ వాసులు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉందని, అనుమతి ఇవ్వవద్దని అని వినతి ఇవ్వడంతో వెంటనే సంబధిత ఎక్సైజ్ సూపరింటెండెట్ కి ఫోన్ చేసి వెళ్లి పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన జ్యోతి అనే మహిళ భర్త ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడని, కుమారుడు మతిస్థిమితం సరిగా లేదని కుటుంబపోషణ కష్టంగా ఉందని వినతి ఇవ్వడంతో వెంటనే లీడ్ బ్యాంకు మేనేజర్ కి ఫోన్ చేసి వీరి లోన్ లో కిరాణా డబ్బా కొట్టు పెట్టించాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -