Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి 

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి 

- Advertisement -

వయోజన విద్యాశాఖ జిల్లా అధికారి విజయ్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ – పాలకుర్తి

గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వయోజన విద్యాశాఖ జిల్లా అధికారి ఆవుల విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో గల ఇందిరా శక్తి మహిళా భవనంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని తొర్రూరు, మల్లంపల్లి క్లస్టర్ల ఓబి, వివోఏలకు అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య, ఉల్లాస్, టాస్ జిల్లా ఇన్చార్జి మురాల శంకర్రావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ జిల్లా అధికారి వేముల నాగరాజు తో కలిసి మాట్లాడుతూ ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని నిరక్షరాస్యులను గుర్తించి, అక్షరాస్యులుగా తీర్చి దిద్దేందుకు వాలంటీర్ టీచర్లను గుర్తించి ఉల్లాస్ యాప్ లో నమోదు చేశామని తెలిపారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి ఓబీలను, వివో ఏ లను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన సిఆర్పిలచే శిక్షణ కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అంకితభావంతో విజయవంతం చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీరాముల  చంద్రశేఖర్, మండల సమాఖ్య అధ్యక్షురాలు గునిగంటి  భాగ్యలక్ష్మి, సెల్ఫ్ సిఆర్పిలు కవిత , సునిత , సిసి కారుపోతుల వెంకటేశ్వర్లు, పాలకుర్తి మండలంలోని  గ్రామాల నుండి ఓబీలు, వివోఏలు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -