- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రయివేటు పాఠశాలల అసోసియేషన్ (ట్రస్మా) జిల్లా ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి మండల కేంద్రంలో గల సుధా టెక్నో స్కూల్ ప్రిన్సిపాల్ రాపాక విజయ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం జనగామలో జరిగిన ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కమిటీలు రెండు సంవత్సరాలు పనిచేస్తాయని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా రాపాక విజయ్ కుమార్ ఎన్నిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



