- Advertisement -
నవతెలంగాణ మిర్యాలగూడ
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూడ డివిజన్ యందు గిరిజన వసతిగృహ, ఆశ్రమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు క్రీడా ఎంపికలు నిర్వహించారు. ఇందులో 16 వసతిగృహముల విద్యార్థులు 250 మంది హజరయ్యారు. కబడ్డీ, కోకో, వాలీబాల్, అథ్లెటిక్స్ యందు ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించిన 100 మంది క్రీడాకారులను నాగర్ కర్నూల్ జిల్లా నందు నిర్వహించే జోనల్ స్థాయి క్రీడా పోటీలకు హాజరు అవుతారని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి చత్రు, జిల్లా సహాయ అధికారి ఎం శ్రీనివాస్ తెలిపారు. మండల విద్యాధికారి ఎల్ బాలునాయక్, ఏసీఎంవో డివి నాయక్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎస్ మహేష్, వసతి గృహ సంక్షేమ అధికారులు, పి ఈ టి లు పాల్గొన్నారు.
- Advertisement -



