రేషన్ నిర్వహణ ను ఇష్టరాజ్యంగా చేస్తే చర్యలు తప్పవు..
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్..
నవతెలంగాణ – మునుగోడు
రేషన్ డీలర్లు రేషన్ నిర్వహణను సమయపాలన పాటించి లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే ఉచిత రేషన్ బియ్యంను ఇబ్బందులు లేకుండా అందించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ రేషన్ డీలర్లకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రేషన్ షాపును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు ఎలాంటి సమాచారం లేకుండా రేషన్ దుకాణాలను మూసివేసి , రేషన్ నిర్వాహనను తమ ఇష్టానుసారంగా అనుకూలంగా ఉన్న సమయంలో రేషన్ ను పంపిణీ చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ నిర్వహణలో అలసత్వం వహిస్తే ఇంతటివారినైనా సహించేది లేదని అన్నారు. రేషన్ పంపిణీ లో డీలర్లు సమయపాలన పాటించని వారిపై తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.
రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



