Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు..

అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్ కు ఫిర్యాదు..

- Advertisement -

– మా ఇందిరమ్మ ఇల్లు మాకు కావాలని ఒంటరి మహిళ ఆవేదన
– పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన పత్రాల ద్వారానే రిజిస్ట్రేషన్ జరిగింది. – సబ్ రిజిస్ట్రార్
నవతెలంగాణ – ఊరుకొండ

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ నాదిరి రేణుక మాదారం గ్రామంలో గల తన ఇందిరమ్మ ఇంటి నెంబర్ 4-127 ఇల్లును అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని.. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేసి, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. గురువారం కల్వకుర్తి పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సబ్ రిజిస్టార్ కు తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లును నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై తగు చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని నాదిరి రేణుక ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో.. ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామానికి చెందిన తన భర్త నాదిరి లత్తిబాబు గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని.. తనకు 11 సంవత్సరాల కూతురు, 9 సంవత్సరాల కుమారుడు ఉన్నట్లు పేర్కొన్నారు. పిల్లలను బ్రతికించుకోవడం కోసం బ్రతుకుతెరువు కావాలని కల్వకుర్తి పట్టణంలో జొన్న రొట్టెలు చేస్తూ పిల్లలను చదివించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఊరుకొండ మండల పరిధిలోని మాదారం గ్రామంలో తమకు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లు ఉందని.. అట్టి ఇల్లును ఇంట్లో కిరాయికి ఉంటున్న బోయ పుష్పలత బాలరాజు.. గ్రామపంచాయతీ కార్యదర్శులు మభ్యపెట్టి.. తమ మామ మల్లయ్యను మోసం చేసి అక్రమంగా ఇందిరమ్మ ఇంటిని వారి పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొంది. ఇట్టి ఇందిరమ్మ ఇంటి కొనుగోలును రద్దుచేసి.. బోయ పుష్పలతబాలరాజు రిజిస్ట్రేషన్ రద్దు చేసి.. సర్టిఫికెట్ ఇవ్వకూడదని కోరారు. అలాగే నాకు నా పిల్లలకు ఉండడానికి ఆశయం కల్పించాలని ఫిర్యాదులో వాపోయింది. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి వీరస్వామిమాదిగ, సీనియర్ నాయకులు దుబ్బ మల్లేశ్, కల్వకుర్తి తాలూకా జేఏసీ చైర్మెన్ కానుగుల జంగయ్య, బీసీ సబ్ ప్లాన్ అధ్యక్షులు మ్యాకల రాజేందర్, పర్వతాలు, బాధితురాలు నాదిరి రేణుక, సంబ పర్వతాలు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -