ఉసిరి కాయలు తినడంఆరోగ్యానికి ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి పచ్చిగా తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. .ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా కనిపించేట్టు చేస్తాయి. ఉసిరి ఈ కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్, జ్యూస్, మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు. ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మ, జుట్టు సమస్యలు ఉన్నా.. అవి తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణముంది. దీనిలోని ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి.



