Friday, November 7, 2025
E-PAPER
Homeజాతీయంసర్‌పై పిల్‌

సర్‌పై పిల్‌

- Advertisement -

అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఈసీకి హైకోర్టు ఆదేశం
కోల్‌కతా : 2002 ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిర్వహించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిల్‌పై స్పందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కొల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈసీ వైఖరిని తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పేర్కొంది. 2002 ఓటర్ల జాబితా ప్రకారం పశ్చిమ బెంగాల్‌తో సహా 12 రాష్ట్రాల్లో సర్‌ను ఈసీ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూనే ఈ పిల్‌ దాఖలయింది. 2025 డాక్యుమెంటేషన్‌, సమాచారం ఆధారంగా ప్రస్తుత సర్‌ను నిర్వహించాలని పిటిషన్‌దారులు కోరారు.

అలాగే పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ)లకు తగిన భద్రత కల్పించాలని కూడా పిటిషనర్లు కోరారు. అనేక మంది ఎన్నికల సిబ్బంది పని ప్రదేశాల్లో బెదిరింపు వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. గురువారం ఈ పిటిషన్‌ను సీజే సుజోరు పాల్‌ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారించింది. ఈసీ తరపు న్యాయవాది అనామిక పాండే తన వాదనలు వినిపిస్తూ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించవద్దని కోరారు. ఇదే అంశం సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉందని చెప్పారు. అయితే ఈ నెల 19లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ధర్మాసనం కోరింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -