నవతెలంగాణ-జోగులాంబ గద్వాల
వందే మాతరం గీతం భారత స్వాతంత్ర్యానికి ప్రేరణగా, ఐక్యత, దేశభక్తి భావానికి శాశ్వత ప్రతీకగా నిలిచిందని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు.శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మహాకవి శ్రీ.బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన “వందే మాతరం” జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ “వందేమాతరం గీతం కేవలం ఒక పాట మాత్రమే కాదు,అది భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆత్మగా నిలిచిన చారిత్రాత్మక ప్రేరణా గీతం” అని అన్నారు.ఈ గీతం భారతీయులలో జాతీయ చైతన్యాన్ని, దేశభక్తిని, త్యాగస్ఫూర్తిని మేల్కొలిపిందని, ఇప్పటికీ మనకు ఐక్యత భావం, దేశభక్తిని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర ఛటర్జీ 1875లో రచించిన ఈ గీతం స్వాతంత్ర్య సమర కాలంలో లక్షలాది భారతీయుల గుండెల్లో జాతీయ చైతన్యాన్ని నింపిందని అన్నారు.ప్రతి పౌరుడు తన దేశం పట్ల ఉన్న బాధ్యతను గుర్తించేందుకు ఇలాంటి సామూహిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు.ప్రజలందరూ వందేమాతరం గీతం వెనుక ఉన్న చరిత్రను,దానిలో ప్రతిఫలించే జాతీయ విలువలను తెలుసుకోవాలని సూచించారు. వందేమాతరం గీతం మన సంస్కృతికి,దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులతో కలిసి “వందేమాతరం” గీతాన్ని ఆలపించారు.కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మి నారాయణ, నర్సింగ రావు, ఎ.ఓ భూపాల్ రెడ్డి,జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వందేమాతరం సామూహిక గీతాలాపన ఘనంగా నిర్వహణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



