- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పాఠశాల స్థాయి చెకుముకి సంబరాలు – 2025 విజయవంతంగా ముగిశాయి. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్, కేజీబీవీ లలో 8 ,9 ,10 వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించారు. ప్రతి తరగతి నుండి అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులు ఈనెల 21న జరిగే మండల స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు ఋషి రాజు, ప్రధాన కార్యదర్శి పరంజ్యోతి, చెకుముకి కన్వీనర్ ఎల్లస్వామి పాల్గొన్నారు.
- Advertisement -



