Saturday, November 8, 2025
E-PAPER
Homeజిల్లాలుకేసీఆర్ పాలన మళ్లీ రావాలంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు

కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటున్న జూబ్లీహిల్స్ ప్రజలు

- Advertisement -

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్
నవతెలంగాణ – తలకొండపల్లి
కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని కోల్పోయిందని కెసీఆర్ పాలన మళ్లీ రావాలని జనం బలంగా కోరుకుంటున్నారని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దేవునిపడకల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ ఆప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతగోవీనాథ్ కు మద్దతుగా  ఇంటింటి ప్రచారంలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల అధ్యక్షులు, మాజీ సర్పంచ్ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేస్తూ బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. అబద్దాల పునాదుల మీద ఎల్లకాలం మనుగడ సాగించాలని చూస్తున్న రాంగ్రెస్ పార్టీన తగు గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

తాము అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచినా రసీసం ఒక్క రాత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాల్ క్యాలెండర్ పేరుతో డ్రామాలాడి నిరుద్యోగులను మోసగించారని మండిపడ్డారు. నెలకు నాలుగు వేల నిరుద్యోగ కృతి విద్యార్థులకు ఐదు లక్షల విద్యావరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలను తుంగలో తొక్కారని అన్నారు. ఎనిమిది వేట కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయకుండా గురుకులాలను నిర్వీర్యం చేసి పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేస్తున్న కాంగ్రెస్ కు యువత, విద్యార్థులు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. యువత, విద్యార్థులు రైతులు, మహిళలు ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ పార్టీ వంచించిందని బయన విమర్శించారు. ఆప ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలితేనే వారికి వారి హామీలు గుర్తుకు వస్తాయని చెప్పారు. లేదంటే మేమెన్ని అబద్దాలు చెప్పినా ప్రజలు వాటినే నమ్ముతారని కాంగ్రెస్ నేతలు విర్రవీగుతారని అన్నారు. జూబ్లీ హిల్స్ ఇపఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాదిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర్ నాయక్, పార్టీ సీనియర్ నాయకులు అంజయ్య గౌడ్, కుమ్మరి మల్లేష్, తలకొండపల్లి బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ స్వామి గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -