Friday, November 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలి: తిరుమలగిరి అశోక్

తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయాలి: తిరుమలగిరి అశోక్

- Advertisement -

నవతెలంగాణ – మిర్యాలగూడ 
తుఫాన్ కారణంగా కురిసిన అకాల వర్షాలకు తడిసి రంగు మారిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల వేల ఎకరాల్లో కోతకు వచ్చిన పంట తడిసి ముద్దయిన సంగతి ప్రభుత్వానికి తెలిసినప్పటికీ రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని, రైతులను రైస్ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అప్పులు చేసి పంటలను సాగు చేసిన రైతులకు తుఫాన్ ప్రభావంతో చేతికొచ్చిన పంట నష్టం వాటిళ్లిందని, దీంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. ధాన్యం రంగుమారిందన్న సాకుతో రైస్ మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు నేటికీ రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని అన్నారు. మిల్లర్ల చేత రంగుమారిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ముళీయాదవ్, పున్నా రాములు, ఈశ్వరచారి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -