Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేద విద్యార్ధులకు అన్యాయం చేస్తున్న రేవంత్ సర్కారు 

పేద విద్యార్ధులకు అన్యాయం చేస్తున్న రేవంత్ సర్కారు 

- Advertisement -

ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో పుస్తకాలు చదువుతూ ధర్న
నవతెలంగాణ – మిర్యాలగూడ 

పేద విద్యార్ధులకు  రేవంత్ సర్కారు అన్యాయం చేస్తున్నాడని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ ఆరోపించారు. శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో పుస్తకాలు చదువుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా డిగ్రీ, పీజీ, బీ ఫార్మసీ, బీటెక్ కాలేజీలు స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కళాశాల యజమాన్యాల సమ్మెకు పోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ పేద మధ్యతరగతి విద్యార్థుల చదువులు రోడ్డుపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులు ముందుకు పోవాలన్నారు. విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు, స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వవలసిన ప్రభుత్వాలే విద్యార్థుల పైన కక్షగట్టి సవతి తల్లి ప్రేమ చూపిస్తూ విద్యార్థులను చదువుకు దూరం చేయడం బాధాకరమన్నారు.

పరీక్షల సమయంలో కళాశాలలో నడవకుండా సిలబస్ పూర్తి గాకుండా విద్యార్థులు ఏ విధంగా ఫాస్ అవుతారనీ ప్రశ్నించారు.  ప్రభుత్వం విద్యార్థుల పక్షాన ఆలోచించి తక్షణమే బకాయిలో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి  విద్యార్ధులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వం ప్రవేట్ కళాశాల యజమాన్యాలతో చర్చలు చేయాలని కోరారు. స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసేంతవరకు నిరంతరాయంగా ఎస్ఎఫ్ఐ పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కమిటీ సభ్యులు మూడవత్ జగన్ నాయక్,  జగదీష్, వీరన్న,  ఎల్ హెచ్ పి ఎస్ రావూరి రవీందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు బన్నీ, సుభాష్, వెంకటేష్, చింటూ, చంటి, చరణ్, గోపి, మహేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -