నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి జాన్ పాల్ నాయక్, అండర్-17 జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికవ్వడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి జాన్ పాల్ నాయక్ ను ఆయన అభినందించి, శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు. రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరచి జాతీయ స్థాయి జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.తద్వారా పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకరావాలని విద్యార్థికి సూచించారు. అనంతరం పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ కల్లెడ నాగేష్ మాట్లాడుతూ ముప్కాల్ మండల కేంద్రంలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో జాన్ పాల్ నాయక్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే 69వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విద్యార్థి జాన్ పాల్ నాయక్ పాల్గొంటాడన్నారు. ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థి జాన్ పాల్ నాయక్ ను ఉపాధ్యాయులు అభినందించారు.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థికి అభినందన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



