Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి

కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలి

- Advertisement -

విద్యార్థి సంఘాల డిమాండ్
అంబేద్కర్ చౌరస్తాలో కళ్లకు గంతలు కట్టి నిరసన
నవతెలంగాణ – వనపర్తి  

కళ్ళుండి చూడలేని గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థుల గోస చూడాలని ఏఐఎస్ఎఫ్, బీసీ విద్యార్థి సంఘం, పి డి ఎస్ యు, టి ఆర్ ఎస్ వి,ఎం ఎస్ ఎఫ్, బి ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలని అక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపి అనంతరం అంబేద్కర్ కు వినతి పత్రం అందించారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు రమేష్, అరవింద్, గణేష్, హేమంత్ , పరశురాములు, లక్ష్మణ్, నరేష్ లు మాట్లాడుతూ విద్యార్థులకు రావలసిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లు గత ఐదు ఆరు సంవత్సరాలుగా రాక ప్రైవేటు కళాశాలలు మూత వేయడంతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మరిచి విద్యార్థులకు చెల్లించవలసిన ఆర్టిఎఫ్ ఎం టి ఎఫ్ విడుదల చేయకుండా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు దుయ్యబట్టారు.

ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉండే 8300 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకపోతే విద్యార్థులందరూ రానున్న కాలంలో రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తారని హెచ్చరించారు. ఈ కళ్ళుండి చూడలేని కబోది ప్రభుత్వం ఓట్ల కోసం సీట్ల కోసం పాకులాడుతుందే కానీ దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని దీనికి కారణమైన ప్రజాప్రతినిధులను రోడ్లమీద తిరగనియ్యరని తక్షణమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని లేని పక్షాన పోరాటాలు ఉదృతమైతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు నరేష్, వంశీ, గోపాలకృష్ణ, సూర్యవంశం గిరి, అరవింద్, బన్నీ,దినేష్, ప్రదీప్ కుమార్, రాజు వివిధ కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -