Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలి

చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలి

- Advertisement -

అశోక్ కుమార్ జిల్లా విద్యాధికారి 
ముగిసిన నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడలు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 

చదువుతోపాటు క్రీడల ప్రాముఖ్యతని ఇవ్వాలని జిల్లా విద్యాధికారి అశోక్ కుమార్ అన్నారు. శుక్రవారం స్థానిక డి.ఎస్ ఏ మైదానంలో  జోనల్ స్థాయి క్రీడా ఉత్సవం నారాయణ ప్రీమియర్ లీగ్ (ఎన్‌పీఎల్) . ఆదిలాబాద్ జోన్, నిజామాబాద్ జోన్‌ల నారాయణ పాఠశాలలు సంయుక్తంగా ఈ పోటీని నిర్వహించాయి. ఈ పోటీల్లో కోకో వాలీబాల్ కబడ్డీ చెస్ క్యారం అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి పి. అశోక్ కుమార్ హాజరై మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడల ప్రాముఖ్యతను ఇవ్వాలని విద్యార్థులదేశిస్తూ అన్నారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు గంటసేపైనా ఏదైనా క్రీడలో తర్ఫీదు ను పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో క్రీడాస్ఫూర్తి, జట్టుకృషి, ఆరోగ్యకరమైన పోటీ భావనలను పెంపొందించడం లక్ష్యంగా నిర్వహించామని నిజామాబాద్ అదిలాబాద్ ఏజీఎం లు శివాజీ ప్రసాద్ లు తెలిపారు.

విద్యార్థుల ప్రతిభను ప్రశంసిస్తూ, చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, సహకారం, నాయకత్వం వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదిలాబాద్ ఏజిఎం శివాజీ, ప్రసాద్, అశోక్, స్వాతి, సంగీత, రాకేష్, అజీమా, కల్పన, నరేష్, కళ్యాణి నిజామాబాద్ జోన్ల ప్రిన్సిపాళ్లు చందన, రజని, కిషోర్, పార్వతి, ప్రభు, స్వర్ణలత హాజరయ్యారు. క్రీడా విభాగం కరణ్ నాయకత్వంలో నిర్వహించబడగా, క్రీడా బాధ్యులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -