Saturday, November 8, 2025
E-PAPER
Homeఆటలుకామన్‌వెల్త్‌ చెస్‌ భారత హెచ్‌ఓడీగా ప్రసాద్‌

కామన్‌వెల్త్‌ చెస్‌ భారత హెచ్‌ఓడీగా ప్రసాద్‌

- Advertisement -

హైదరాబాద్‌ : కామన్‌వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌ పోటీల్లో పాల్గొనే భారత జట్టు హెచ్‌ఓడీగా (హెడ్‌ ఆఫ్‌ డెలిగేషన్‌) తెలంగాణ చెస్‌ సంఘం మాజీ అధ్యక్షుడు కె.ఎస్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ నెల 8 నుంచి 17 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరుగనున్న కామన్‌వెల్త్‌ చెస్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌ నుంచి పలు వయో విభాగాల్లో 55 మంది క్రీడాకారులు పోటీపడతున్నారు. తెలంగాణ నుంచి అండర్‌-19 చాంపియన్‌ ఆదిరెడ్డి అర్జున్‌, అండర్‌-17 చాంపియన్‌ శ్రీరామ్‌ ఆదర్శ్‌, జాతీయ అండర్‌-9 చాంపియన్‌ నిదిశ్‌ శ్యామల, జాతీయ అండర్‌-13 చాంపియన్‌ శరణ్యదేవి నరహరిలు ఈ పోటీలకు అర్హత సాధించారు. భారత బందానికి హెచ్‌ఓడీగా నియమితులైన కెస్‌ ప్రసాద్‌, తెలంగాణ చెస్‌ మాస్టర్లను రాష్ట్ర చెస్‌ సంఘం అధ్యక్షులు లక్ష్మిరెడ్డి అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -