Saturday, November 8, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీ సాయి విజ్ఞాన్ హైస్కూల్ లో మాక్ ఎలక్షన్..

శ్రీ సాయి విజ్ఞాన్ హైస్కూల్ లో మాక్ ఎలక్షన్..

- Advertisement -

నవతెలంగాణ – సదాశివ నగర్
మండలంలోని శ్రీ సాయి విజ్ఞాన్ హై స్కూల్ పద్మాజివాడి ఎక్స్ రోడ్ లో విద్యార్థులకు ఎలక్షన్ పట్ల అవగాహన కోసం మాక్ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది. శనివారం విద్యార్థులకు పుస్తక పరిజ్ఞానమే కాకుండా ఎలక్షన్ల పట్ల ప్రాక్టికల్ అవగాహన కల్పించడం కోసం పూర్తి ఎన్నికల ప్రక్రియను ఒక క్రమ పద్ధతిలో జరిపించడం జరిగింది. విద్యార్థులకు ముందుగా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఆ తర్వాత పిల్లలనుంచి నామినేషన్ల స్వీకరణ ఆ తర్వాత నామినేషన్ ఉపసంహరణ ప్రచారానికి కొంత సమయం, ఆ తర్వాత  పోలింగ్ నిర్వహించడం జరిగింది. చాలామంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. వారికి ఎలక్షన్లో మాదిరిగానే వివిధ పార్టీల వారీగా గుర్తులను కేటాయించడం జరిగింది. వాళ్ళ క్లాస్ విద్యార్థులు  వాళ్ళ క్లాస్ లీడర్లను వారే ఎన్నుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఎలక్షన్ల ప్రక్రియ  పూర్తయిన తర్వాత పదో తేదీన రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది విద్యార్థులు ఉపాధ్యాని ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -