నవతెలంగాణ – తలకొండపల్లి
తెలంగాణ రాష్ట్ర ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలిపారు. శనివారం మండల కేంద్రంలో బస్టాండ్ ఎదుట రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు పార్టీని బలోపేతం చేసి తగిన కృషి చేస్తామని అన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాము తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, నాయకులు బోళ్ళ యాదగిరి, రాజేందర్ నాయక్, గిరిధర్ రెడ్డి, గణేష్, శేఖర్, దేశీయ నాయక్, రాఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



