నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని పివిఆర్ భవన్ లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రేవంత్ రెడ్డి 100 సంవత్సరాలు వర్ధిల్లాలని నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శనివారం సంబరాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, జాంబి హనుమాన్ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ ,బీసీ సెల్ అధ్యక్షులు దొండి రమణ , సీనియర్ నాయకులు ఖాందేష్ శ్రీనివాస్ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను ,లింగ గౌడ్ నాయకులు అజ్జు బాయ్ , జిమ్మీ రవి , శ్యామ్ గౌడ్ శాల ప్రసాద్ , మట్టెల శ్రవణ్ , ఫహిం , చిట్టి రెడ్డి, భూపేందర్ ,లిక్కి శంకర్ ,విజయ్ అగర్వాల్ ,సాయినాథ్ ఇట్టడి నరస రెడ్డి ,లక్మన్ , షహీద్ ,సాయి కుమార్ ,శెట్టిపల్లి నారాయణ ,ఇంతియాజ్ ,నటరాజ్ తదితర నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ఆలూర్ మండల కేంద్రంలో..
ఆలూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ ఆధ్వర్యంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది అని ఆయన నాయకత్వం యువతకు ప్రేరణగా నిలుస్తోంది అన్నారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ చిరంజీవి, భాస్కర్, సంజీవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నారాయణ, ఉదయ్, నవనీత్, ముత్యం రెడ్డి,కిషన్, నిలగిరి శ్రీనివాస్,శివ, మహేష్, రాజు, రాము కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు పాల్గొన్నారు.



