Saturday, November 8, 2025
E-PAPER
Homeజాతీయంస్కూటీని ఢీకొట్టిన రేసింగ్‌ బైక్‌.. యువతి మృతి

స్కూటీని ఢీకొట్టిన రేసింగ్‌ బైక్‌.. యువతి మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భవికా గుప్తా(23) అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఫ్రెండ్ నేహా మిశ్రాతో కలిసి భవికా స్కూటీపై గంగా బ్యారేజీ వద్దకు వెళ్తుండగా వేగంగా వచ్చిన రేసింగ్ బైక్ వారిని ఢీకొట్టింది. భవికాను బైక్ సుమారు 50 మీ. దూరం ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలై ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. నేహా మిశ్రా చికిత్స పొందుతోంది. పోలీసులు ఒక బైక్‌పై ఉన్న ఇన్‌స్టాగ్రామ్ స్టిక్కర్ ఆధారంగా నిందితుల్లో ఒకరిని గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -