- – మంత్రి శ్రీధర్ బాబు సొంత మండలంలోని అధ్వానంగా మారిన రోడ్లు
- – బీఆర్ఎస్ కాటారం పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్
- నవతెలంగాణ – కాటారం : బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో కాటారం నుండి గంగారం x రోడ్డు పనులు ప్రారంభం కావడం జరిగింది. శ్రీధర్ బాబుకి ఈ ప్రాంత రోడ్డు సమస్యలు పట్టడం లేదని రామిళ్ల కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రామిళ్ల కిరణ్ రోడ్డు సందర్శించి మాట్లాడుతూ… నీళ్ల కోసం బావులను తవ్వినమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటాలు గుర్తు వచ్చియి అని అనుకుంటా… ముందుగానే ఆలోచన చేసి ఈ రోడ్ల పైన మంత్రి గుంతలు తవ్వినట్టు కనబడుతుంది.
రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డుమీద వివిధ సంఘాల నాయకులు, సోషల్ మీడియాలో ఎన్నో రకాల యూట్యూబ్ ఛానల్ పోరాడిన శ్రీధర్ బాబు నిమ్మక నీరెత్తినట్టే వ్యవహరిస్తున్నాడు. మొన్నటికి మొన్న ఇలాంటి రోడ్డు వలనే చేవెళ్లలో బస్సు ప్రమాదం జరిగి దాదాపుగా 25 మంది చనిపోవడం జరిగిందని, అదే పరిస్థితి ఇక్కడ సంభవించదా.. అని అన్నారు. దీని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారిని ఇబ్బంది పెట్టకుండా త్వరగా రోడ్డును పూర్తి చేయాలని, ఈ రోడ్డుమీద ప్రత్యేక శ్రద్ధ చూపి సీఎం తర్వాత సీఎం అని చెప్పుకుంటున్నటువంటి శ్రీధర్ బాబు ఎందుకు ఆర్ అండ్ బి మంత్రితో మాట్లాడి ఎందుకు త్వరగా పనిని పూర్తి చేయాలాని అన్నారు. నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మానేం రాజబాబు, ఉప్పు సంతోష్, విక్రమ్, కొండపర్తి రవి, మహేందర్, జాగరి మహేష్, బొడ్డు మోక్షక్ పాల్గొన్నారు.


