నేరుగా మిల్లుకు తరలింపు
వెలుగులోకి వచ్చిన ఘటన
నవతెలంగాణ – మిర్యాలగూడ
కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని విక్రయిస్తే ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించగా దాన్ని కాజేసేందుకు అధికార పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు పన్నాగం పన్నారు. తమ పొలాల్లో పండిన నాణ్యత లేని సన్నరకం ధాన్యాన్ని పీఏసిఎస్ కేంద్రాల్లో విక్రయించకుండా విక్రయించినట్లు అనధికారికంగా ట్రక్ షీట్ రాయించుకోని నేరుగా మిల్లుకు తరలించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ, త్రిపురారం మండలానికి చెందిన ఇద్దరు రైతులు తమ పొలంలో పండిన 741బస్తాలు(296 క్వింటాళ్ల) ధాన్యాన్ని మిర్యాలగూడలోని అవంతీపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు ట్రక్ట్ రాయించుకోని మిర్యాలగూడలోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. కాగా ఆ కొనుగోలు కేంద్రాలతోపాటు ఇతర కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు సన్నరకం ధాన్యాన్ని గింజకూడా కొనుగోలు చేయలేదని అధికారులు తెలిపారు. ఈ నేపధ్యంలో అవంతీపురం కొనుగోలు కేంద్రాల్లో 296 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించి మిల్లుకు తరలించడంపై బోనస్ ను కాజేసేందుకే ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అధికారులు విచారణ చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలులో మోసం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



