Sunday, November 9, 2025
E-PAPER
HomeNewsఆ.. మార్పుకి నాంది పలికే చిత్రం

ఆ.. మార్పుకి నాంది పలికే చిత్రం

- Advertisement -

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 14న థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో శనివారం దర్శకుడు సంజీవ్‌ రెడ్డి మీడియాతో ముచ్చటించారు.
‘ఫెర్టిలిటీ ఇష్యూస్‌ మన సమాజంలో ఉన్నాయి. మేల్‌ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ మెంబర్స్‌ కొందరు ఇలాంటి సమస్యతో బాధపడ్డారు. వారికి ఆధునిక వైద్యంతో పిల్లలు పుట్టినా, ఆ క్రమంలో వారు సొసైటీ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్‌ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని ఈ స్క్రిప్ట్‌ రెడీ చేశాను.మా సినిమా ద్వారా ఒక సమస్యపై అవగాహన కల్పిస్తున్నాం, ఒక చిన్న మెసేజ్‌ కూడా ఉంటుంది.
మా సినిమాను చూసేందుకు పిల్లలు లేని కపుల్స్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ గానీ ఎక్కడా ఇబ్బంది పడరు. హీరోకి ఉన్న లో స్పెర్మ్‌ కౌంట్‌ అనేది కథలో ప్రధానాంశం. మా సినిమాను ఇప్పటిదాకా చూసిన వాళ్లంతా అప్రిషియేట్‌ చేశారు. ఇదే ప్రశంసలు రేపు ప్రేక్షకుల నుంచి కూడా వస్తాయని ఆశిస్తున్నాం. ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మంచి మెసేజ్‌ కూడా ఉంది కాబట్టి ప్రేక్షకుల్ని మెప్పిస్తామనే నమ్మకంతో ఉన్నాం.
ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే అంశాన్ని ఓపెన్‌గా డిస్కస్‌ చేస్తారనే అనుకుంటున్నాం. ఆ మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు మా సినిమా అవుతుందని ఆశిస్తున్నాం’ అని దర్శకుడు సంజీవ్‌ రెడ్డి చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -