Sunday, November 9, 2025
E-PAPER
Homeజాతీయంబిగ్ బాస్ షో చూస్తూ బ‌స్సు న‌డిపిన డ్రైవ‌ర్

బిగ్ బాస్ షో చూస్తూ బ‌స్సు న‌డిపిన డ్రైవ‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: కొంత‌మంది డ్రైవ‌ర్లు వాహ‌నాలు న‌డిపేట‌ప్ప‌డు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఓ బ‌స్సును న‌డిపిన విష‌యం తెలిసిందే. అదే త‌ర‌హాలో బిగ్ బాస్ షో చూస్తూ హై స్పీడ్‌తో ఓ బ‌స్సు న‌డిపాడు డ్రైవ‌ర్. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైర‌ల్ అవుతోంది.

ఆ వీడియో ప్ర‌కారం.. బ‌స్సు ముంబై నుంచి హైద‌రాబాద్‌కు వెళ్తోంది. తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మయంలో బ‌స్సు డ్రైవ‌ర్ స్టీరింగ్ వ‌ద్ద ఫోన్ పెట్టుకుని బిగ్‌బాష్ షో చూస్తూ క‌నిపించాడు. ఆ స‌మ‌యంలో బ‌స్సు గంట‌కు 80 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్తోంది. బ‌స్సులోని ఓ ప్ర‌యాణికుడు దీన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలోపోస్టు చేయ‌గా.. ప్ర‌స్తుతం అది వైర‌ల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజ‌న్లు ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నిర్ల‌క్ష్యంగా బ‌స్సు న‌డుపుతున్న డ్రైవ‌ర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న అక్టోబ‌ర్ 27న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

దేశంలో ఇటీవ‌లే బ‌స్సు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తోన్న విష‌యం తెలిసిందే. ఏపీ క‌ర్నూలు, తెలంగాణ చేవెళ్ల‌లో జ‌రిగిన ప్ర‌మాదాల్లో ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -