నవతెలంగాణ- తుంగతుర్తి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు తధ్యమని టిపిసిసి ఉపాధ్యక్షులు,ఓబీసీ విభాగం ఇంచార్జ్ తండు శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.ఆదివారం నవీన్ యాదవ్ తో కలిసి యూసుఫ్ గూడ ప్రాంతంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం గత 22 నెలలుగా అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాల పాలనను ఆశీర్వదించడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రజలు,వారు ఇస్తున్న బలం జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పడానికి సాక్ష్యం అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని,వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు.ఉప ఎన్నికలో విజయం సాధించి జూబ్లీహిల్స్ అభివృద్ధికి కొత్త దిశ చూపించాలని కోరారు.ఉప ఎన్నికల్లో సానుభూతి పనిచేయదని,అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయడం వల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది,అని ప్రజలు ఆలోచించి అధికార పార్టీకి ఓటు వేస్తారని తెలిపారు.అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపిస్తారని,పది సంవత్సరాలు బిఆర్ఎస్ అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా లూటీ చేశారని అన్నారు. ఈ ఉపఎన్నికతో బీఆర్ఎస్ శకం ముగుస్తుందని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని కోరారు.కాంగ్రెస్ తోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు తథ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



