Sunday, November 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఐటమ్ సాంగ్‌కి కేటీఆర్ ప్రచారానికి తేడా లేదు: సీఎం ప్రెస్ మీట్

ఐటమ్ సాంగ్‌కి కేటీఆర్ ప్రచారానికి తేడా లేదు: సీఎం ప్రెస్ మీట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: సినిమాలలో ఐటమ్ సాంగ్ ఉన్నట్టు కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. పుష్పలో శ్రీలీల ఐటమ్ సాంగ్‌కి కేటీఆర్ ప్రచారానికి తేడా లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మీట్ ది ప్రెస్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు..రెండేళ్ల మా పాలన పదేళ్ల వాళ్ళ పాలనకు పోల్చండి. మొత్తానికి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాకు ఆప్పగించారు కేసీఆర్. తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చారు. కాళేశ్వరం లేకున్నా.. దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈ స్థాయిలో ఉత్పత్తి లేదు. లక్ష 86 వేల కోట్లు సాగు నీటి కాంట్రాక్టర్స్ కి ఖర్చు చేశారు. కానీ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 27 వేల కోట్లు పాలమూరు ఎత్తిపోతలకు ఖర్చు చేశారు. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఉస్మానియా ఆసుపత్రి కొత్తది కట్టలేదు.. కూలిపోతే పరిస్థితి వచ్చింది అన్నా.. పట్టించుకోలేదు.. ఏడాదిన్నరలో కమాండ్ కంట్రోల్ సెంటర్.. సెక్రటేరియట్.. కట్టుకున్నాడు.. కేటీఆర్ దశనే సక్కగా లేకుంటే.. దిశ ఎట్లా మారుస్తారు. సొంత చెల్లిని.. మాగంటి తల్లిని అవమాన పరిచిన ఆయన ఎలా మహిళలకు రక్షణగా ఉంటారు. సన్నబియ్యం రూ. 3 కోట్ల 10 లక్షలాది మందికి ఇచ్చారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పది లక్షలకు పెంచాం. 9 రోజుల్లో 9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చాం. కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఆపలేదు. వాటిని కొనసాగించాం. మూసి ప్రక్షాళన చేస్తా అంటే.. కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. మూసి లో మునిగిపోతుంటే ఎందుకు వెళ్ళి అక్కడ పడుకోలేదు.” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ప్రజాపాలన ప్రారంభమై రెండేళ్లైంది.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.. మీట్ ది ప్రెస్‌లో సీఎం పాల్గొని మాట్లాడారు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసింది.. కానీ.. రాష్ట్రం వచ్చాక ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారన్నారు. 2004లో ఉచిత కరెంట్‌పై వైఎస్సాఆర్ మొట్టమొదటి సంతకం చేశారని గుర్తు చేశారు.. రైతు రుణమాఫీ అమలు చేసి రైతులను ఆదుకుంది.. కరువు ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి జలయజ్ఞం చేపట్టారన్నారు.. కానీ, గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరు మార్చి నిధులు కొల్లగొట్టిందని ఆరోపించారు.. గతంలో నీళ్ల కోసం మహిళలు రోడ్డెక్కిన పరిస్థితులు ఉండేవన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -