- Advertisement -
నవతెలంగాణ-భువనగిరి: భువనగిరి అర్బన్‌లోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో తడక ప్రకాష్ ఇంట్లో మంటలు అంటుకొన్నాయి. మంటల ధాటికి నగదు, బంగారం, బియ్యం, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేరు ప్రాణనష్టం జరగలేదు. ఇంట్లో నుండి మంటలు రావడంతో ఇరుగు పొరుగు వారు చూసి ఇంటి తాళం పగలకొట్టి మంటలు ఆర్పారు. సుమారు 5 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు తెలిపారు.
- Advertisement -



