Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రీడల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిల ప్రతిభ 

క్రీడల్లో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థిల ప్రతిభ 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
జోనల్ స్థాయి క్రీడల్లో మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు ప్రతిభను కనబరిచి సత్తా చాటారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సందరాజా స్వరూప తెలిపారు. ఆదివారం స్వరూప మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఈనెల 5 నుండి 8 వరకు జరిగిన క్రీడల్లో విద్యార్థినిలు ప్రతిభను కనబరిచి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారని తెలిపారు. 14 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు విద్యార్థినీలకు నిర్వహించిన జోనల్ స్థాయి క్రీడల్లో అథ్లెటిక్స్, కోకో, కబడ్డీ, వాలీబాల్, టెన్నిస్ క్రీడల్లో ప్రతిభను కనబరిచి ఆల్ రౌండర్ గా నిలిచారని తెలిపారు. క్రీడారంగాల్లో మొదటి, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారని అన్నారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతివను కనబరిచి పాఠశాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఆకాంక్షిస్తూ జోన్ స్థాయి క్రీడల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థినీలను ప్రిన్సిపాల్ స్వరూపతో పాటు వైస్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి, పిడి షేక్ రేష్మ, పిటి నాగపూర్ణులతో పాటు ఉపాధ్యాయులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -