స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం
నవతెలంగాణ – పెద్దవంగర
వారంతా చిన్ననాటి స్నేహితులు, అంతా కలిసి మెలిసి చదువుకున్నారు. పెరిగి పెద్దయ్యాక, ఎవరికి వారు జీవితాలలో స్థిరపడ్డారు. ఇంతలో తమతో చదువుకున్న చిన్ననాటి మిత్రుడు మృతి చెందాడని తెలుసుకుని చలించిపోయారు. ఎలాగైనా స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని సంకల్పంతో, బృందంగా ఏర్పడి చేయి చేయి కలిపారు. తమకు చేతనైన సాయాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు సేకరించిన నగదు మొత్తాన్ని స్నేహితుడి భార్యకు అందజేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పోచారం శివారు భద్రు తండాకు చెందిన ధరావత్ సోమాని (41) ఇటీవల గడ్డి మందు తాగి మృతి చెందాడు. 1997-98 పదో తరగతి బ్యాచ్ కు చెందిన స్నేహితులు కలిసి రూ. 21 వేలు స్నేహితుడి భార్య అనిత, కుమారుడు వేణు కు అందజేశారు. స్నేహితుడితో ఉన్న జ్ఞాపకాలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కొమరమల్లు, సంపత్, రాము, సోమన్న, శ్రీనివాస చారి, లక్ష్మణ్, మేనక, రోజా, లలిత, కళ్యాణి, నాగమణి, ఉదయ్, కుమార్, నరేష్, రమేష్, చంద్రశేఖర్, శ్రీను, సతీష్, శ్రీను, మురళి, సుధాకర్, రమేష్, రామకృష్ణ, గోపాల్, స్వామి, ఎర్రన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



